¡Sorpréndeme!

Telangana Elections 2018 : కేటీఆర్ కు తండ్రి మాట మీద నమ్మకం లేనట్టా...!! | Oneindia Telugu

2018-11-16 567 Dailymotion

ktr talks comfort ability majority going weapon to opposition parties. kcr saying that trs won hundred seats in coming elections.
#telanganaelections2018
#ktr
#kcr
#trs
#congress
#tjs
#tdp


ముందస్తు ఎన్నికల మాట మొదలు అభ్యర్థుల ప్రకటన దాకా వంద స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని చెబుతూ వచ్చారు ఆపార్టీ అధినేత కేసీఆర్. 119 స్థానాలకు గాను వంద స్థానాలు గెలిచి చరిత్ర సృష్టిస్తామని సవాల్ చేశారు. కేసీఆర్ "వంద" పై ప్రత్యర్థి పార్టీలు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశాయి. వందేమో గానీ ఈసారి టీఆర్ఎస్ కు అపజయం ఖాయమని జోస్యం చెప్పాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. మహాకూటమి ఆరోపణల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు కేటీఆర్. తన సవాల్ స్వీకరించే దమ్ము టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా అంటూ ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీతో గెలుస్తామనే నమ్మకముంది కాబట్టే తాను ఈ సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారింది.